Songs

Paatalu. As a singer-songwriter.

10958½

30 orbits around the Sun 🤎

Lyrics

Telugu

పదివేల తొమ్మిదొందల,
యాభై పై ఎనిమిదిన్నర.

పదివేల తొమ్మిదొందల,
యాభై పై ఎనిమిదిన్నర.
పసి పాలగుమ్మ చిందులా,
పడు అడుగులు చాలా చిన్నరా…

ఎగిరిపోయే రోజులన్నీ జేరి
వరుస వాలి వరుస గట్టి వారి
కథలు నన్ను చెప్పమంటూ కోరి
ముప్పదేళ్ల అనుభవాల దారి

సరే సరే అందామనుకుంటే,
అందనివెన్నెన్నో…

(ఇంతకీ, ఎన్ని రోజులయ్యింది?)

పదివేల తొమ్మిదొందల,
యాభై పై ఎనిమిదిన్నర!


నెరిసే చెంపలు దాగుడుమూతలు
ఆడుతున్నాయి కొత్తగా… హుఁ!
ఇక కలం తీసే కూనిరాగం,
ప్రేమిస్తా ఇది నాలో భాగం.

మెరిసే కెంపులు కురిపే దాతలు
వెతకనీకు కను మత్తుగా…
దాహం ఉన్నా విషము తాగం.
మనది కాని దాని కోసం ఆగం.

అద్దమబద్దము ఆడును అనక
కొద్దిగ సిద్ధము ఐతే గనక
జివ్వుమన్న వాస్తవాన మునక
ఇవ్వు దారి, రాదా నీకు వెనుక?

తేలికవునో కాదో తేలకున్నా
తీరికుంది తేరుకొందుకైనా
తేలుతానో లేదో తోచకున్నా
తేలిపోతుందిగా

(చాలా టైమ్ వుంది. అయ్యింది కొన్నేగా.)
(కొన్నంటే?)

పదివేల తొమ్మిదొందల,
యాభై పై ఎనిమిదిన్నర!

నా…
ప్రేమనందుకున్నదెంతమంది?
కొందరున్న చాలు తిరిగి పొంది
ఒప్పుకోకపొతే స్నేహ సంధి
తప్పదింక చేసేదేది వుంది?
ఎందరున్న నేను నమ్ముకుంది
నన్నే గనక లెదు ఏ ఇబ్బందీ
నాకు నేనె సేనా-సిబ్బంది, ఈ
మాట నాడు లోలో వెలిగింది
నాటి నుండి నెమ్మది చిలికింది
ఆలోచించుకోగా నిలిపింది
కాకపోతే కాస్త చెమట చింది
దారి దిద్దుకోక తప్పదంది, ఈ

అరనిమిషానికి చాలా జరిగింది…!

(30 seconds… Go, go!)

ఆ…
ఇరుగు పొరుగు ఇంట జోరు వింది
పరుగు పరుగు అంటే ఊరుకుంది
తరిగి తరిగి గుప్తమెరిగి వుంది
తిరిగి తిరిగి తృప్తి జేరుకుంది
చిరుగు పడితే సూదిదారముంది
మెరుగు పెడితె బుద్ధి సారం అంది
ఝరికి కరిగె కష్టం ఏది వుంది?
“జరిగి దరికిరా!” జవాబు అంది
విరిగి చెఱగిపోని కోరికుంది
పెరిగి పెరిగి జీవం అందుకుంది
ఎరిగి మరి గతాలు చిలికింది
సరిగ సిరిగ మారి ఊపిరందింది…
క్షణమే యేటై, మనమౌ పాటై,
మూడు పదులు ముప్పదేళ్ళ బాటై, ఈ
అరనిమిషంలో చాలా చాలా
చాలా చాలా
చాలా చాలా చాలా జరిగింది…!

-x-

Tinglish

Translation

Gheenkaarame

Gheenkaarame Thumbnail
Gheenkaarame Thumbnail

I was devastated when I heard about the pregnant elephant in Kerala having dies in those disturbing circumstances. I couldn’t stop crying, so I wrote this Telugu song on how the male elephant must be feeling to know his mate and child are gone forever. 

No music score. It didn’t feel appropriate in this time.

Sang with regular AirPods, so apologies for any background noise you might here.

RIP, mother & child 🐘🐘😭😭😭

Lyrics

Telugu

ఘీంకారమే సమర శంఖాల రావమని పూరించనా…?
మమకారమే అమర దుఃఖాల భావమని వారించనా…?
అటు ఊగి ఇటు ఊగి తేల్చుకోలేక, 
చీకటి తాగుతూ గాలి పీల్చుకోలేక,
జలజలాకారి కరి కన్నీటిధార, 
నదిజలములో జేరి పయనించదా?
గలగలాపారి మరి మున్నీటి దారిలో 
రాగలను నేను ఝరి దయ వుంచదా?
ఎదురుచూసా లాలి పాడాలని, 
నుదురు నిమరాలని, 
కుదిరేది కాదా…? 
ఇంక కుదిరేది కాదా?…
చెదిరి మోసా తేలి ఆడాలని, 
కుదురు అమరాలని.
తను తిరిగి రాదా…? 
ఇంక తను తిరిగి రాదా…?

Tinglish

Gheenkaarame samara sankhala raavamani poorinchana…?
Mamakaarame amara du:khaala bhaavamani vaarinchana…?
Atu oogi itu oogi telchukoleka…
Cheekati taagutoo gaali peelchukoleka…
Jalajalaa kaari kari kanneeti dhaara,
Nadijalamulo jeri payaninchadaa?
Galagalaa paari mari munneeti daarilo
Raagalanu nenu jhari daya vunchadaa?
Eduruchoosaa laali paadaalani,
Nuduru nimaraalani,
Kudiredi kaadaa…?
Inka kudiredi kaadaa…?
Chediri mosaa teyli aadaalani,
kuduru amaraalani.
Tanu tirigi raadaa…?
Inka tanu tirigi raadaa..?

Translation

Should I sound my trumpet as a battle cry?
Should I argue that affection causes endless pain?
Swinging this way and that, I can’t decide.
Drinking in darkness, I can’t breathe.
The steady flow of her (elephant’s) tears,
Joining the river and on a journey,
To flow into the endless seas,
I can come with you…
but why won’t it take me in?
I’ve waited to sing lullabies,
To caress your head,
Is that not possible?
Is that forever not possible?
I carry this weight disturbed,
to be lightened someday,
For some stability.
Won’t she come back?
Won’t she ever come back?

Video

https://youtu.be/Zkg98vEhSoQ

Taapam

My own project.

I also played the role of Earth in my video.

Lyrics

Telugu

ఇక
గాజు తీగ మృదువు మీటి చాలదు,
రాజుకున్న నిప్పు కణములెదుట. “స-
-మాజమా!” అని చేయి చాచిన రాలదు,
హాజరవ్వరసలు జనము మొదట. ఈ
తల్లి కడుపు కాలుతున్న నవ్వి,
కుళ్ళిపోయే దాకా నన్ను తవ్వి,
జల్లెడేసి జీవమింత ఓడిన
మళ్లీ నాలో మిగిలినంతా తోడి,
విలువలు వాగే రాజికీయం
సలసల కాగితే బదులివక,
విలవిలలాడినా తలుపు తీయ్యవ్! నీ
కాపరి ఒప్పినదూపిరికా!??
నెత్తుటి మరకలు కొత్తేం కాక,
మెత్తటి ఇరుకుల మత్తులు పోక,
కత్తిపోటులిక లెక్కకు రాక,
విత్తునాటడం విలువ తెలీక, నే
ఊరుకుంటే తెగ రెచ్చిపోతావు,
వికృతమే నువ్వాడే ఆట. నే
జూలు విదిలిస్తే చచ్చిపోతావు (విను)
ప్రకృతిగా ఇది నా మాట! (నువు)
ఎక్కితొక్కేటి బానిసగాను!
మక్కలొక్కోటీ నాకు జవాను!
లెక్క తక్కువైతె వూరుకోను!
ఒక్క హక్కు కూడ వదులుకోను!

(నువు) దిక్కు తోచకే దిక్కు పట్టినా
నేను తప్ప దిక్కు లేదు నీకు.
తిక్క పెట్టి(-నా / నువు) గుక్కబెట్టినా-
-గాని రెప్ప చుక్క లేదు, నీ కను-
-లింత పిసరు కూడ తడవలేక,
అంతరసుర నీడ విడువలేక,
పాలు దక్కగానె రొమ్ము తన్నితే
పేలి వక్కలవ్వు కొమ్ములన్నీ! (ఏఁ!?)
మంచిగ చెప్తే బుఱ్ఱకెక్కదా!?
కళ్ళు నెత్తికెక్కాయా!? ఏఁ!?
కంచె విప్పితే విఱ్ఱవీగుతూ
వెళ్ళి విషము కక్కేయ్యాలనుకొని
గొడ్డలుంది నాకు అన్న పొగరే,
వున్న కొమ్మ నరకమన్న తెలివై,
అడ్డముంది పీకనున్న చిగురే,
చిన్న రెమ్మ అతకలేవు, అలవే
లేదన విషయం బయిటకొస్తే
కాదని అగ్గితో అనగలవా?
నీదను విషమే పరులు చూస్తే,
ఇక వాదన నెగ్గుకు రాగలవా?
వితండవాదం సరిపడు కసికి,
మతుండే? (నీ) పాదం తలపడు నిశికి!?
వేరు నరికి వేరుగావు, పిచ్చా!?
దారి మురికి కోరి చావు చచ్చావ్!
అనుకొని పెరికి విసరి వేస్తే సం-
-తాపము క్షణమే తాకునుగా. నే-
-లెరుగని శూన్యము లోకి తోస్తే
భూతాపము వెనుకకు పాకునుగా!
నాటినుండి నాటమంటూ ఉండే
మాటనుండి సూటి గుండె పిండే
పాట పండి కోటికండగుండి
చాటి రండి మండుటెండకెండి. ఇక

Tinglish

Translation

Video

https://youtu.be/GxfL7jWFXms

Chilaka

చిలక

Premise: He would love for her to talk to him again, but knows the choice is hers, and he’s willing to respect that.

I wanted a Telugu love song where he *doesn’t* stalk or patronize her.

Happy Valentine’s Day! ♥︎ Enjoy my first love song.

Lyrics

First draft. Has typos. 😂

Telugu

పలచని పిలుపుల చిలక.
పిలిచిన పలుకవే ఏం అలక.
గెలిచినా అంచున మెలిక. [huh]
తలచిన చెప్పవే కాదనక.

నిలిచానే నీ వెనుక,
నను వలచిన చెలి చిలక.
ఉలకక పలకక తొలకరి చినుక,
మబ్బు వదలవే, వలకక అలక,

ఏమయ్యింది పలకవె కాదనక…
అసలేమయ్యిందో తెలుపవే వలదనక…
ఇపుడేమయ్యిందని నామీదింతలక…
చెప్పేమనుకోలే ప్రేమించా గనక… నా రా చిలక…

వింత సత్యాలు తెలిపితే మాత్రం, నేనన్నది తప్పా?
ఎంత ముత్యాలు రాలితే మాత్రం, ఏంటో నీ గొప్ప?

సొంత కృత్యాల వలనా ఆత్రం దాచెను కనురెప్పా?
ఈ పంతం అత్యావసరమా? చిత్రం. వున్నదే కద చెప్పా?
ఈ రొంత దానికే విప్పవా గాత్రం, విడమరిచడిగితే ముప్పా?
ఇంత ప్రేమకూ పునాది సూత్రం, ఏంటి గౌరవం తప్పా?

మరింత నీ చెంత చేరేంత కొంత నా వంతు సొంత గొంతు పలికింది ఇంతా.
మనకంతకంతకూ ఇంతకింతకూ బాగుండేందుకే ఇదంతా.

కనుకేమయ్యింది పలకవె కాదనక…
అసలేమయ్యిందో తెలుపవే వలదనక…
ఇపుడేమయ్యిందని నామీదింతలక…
చెప్పేమనుకోలే ప్రేమించా గనక… నా రా చిలక…

పొద్దున వరకు పరిచయమున్నది వేరే కథ కాదా?
హద్దుదాటాను అనుకొపొతే నిమిషం వినరాదా?
వద్దు అన్నాక వెంటపడనమ్మ, తెలుసును మర్యాదా.
సద్దుకు విడివిడి అడుగులు పడితే తేలికే అవునా కాదా?

కొద్దిగ నిలబడి అలోచిస్తే ఎందుకీ తగాదా?
దిద్దుకోవటం దారిలో దిగితే దూరము దరికే రాదా?

పెద్దపెద్ద వాటి వద్ద ఒద్దిక ఇద్దరున్న అద్దమందు చూద్దువు వద్దా?
నీ ముద్దు ముద్దయిన మద్దతు విని నే సిద్ధము వద్దకు కదులుతా.

కథకేమయ్యింది పలకవె కాదనక…
అసలేమయ్యిందో తెలుపవే వలదనక…
ఇపుడేమయ్యిందని నామీదింతలక…
చెప్పేమనుకోలే ప్రేమించా గనక… నా రా చిలక…!

Tinglish

palachani pilupula chilaka.
pilachina palukave, em alaka.
gelichinaa anchuna melika. huh.
talachina cheppave, kaadanaka.

nilichaane nee venuka,
nanu valachina cheli chilaka.

ulakaka palakaka tolakari chinuka,
mabbu vadalave, valakaka alaka?

emayyindi? palukave kadanaka…
asalemayyindo telupave valadanaka…
ipudemayyindani naameedintalaka…
cheppemanukole preminchaa ganaka… naa raachilaka

vinta satyaalu telipite maatram, nenannadi tappa?
enta mutyaalu raalite maatram, ento nee goppa?

sonta krutyaala valanaa aatram daachenu kanureppa?
ee pantam atyavasaramaa? chitram. vunnade kada cheppa?
ee ronta daanike vippavaa gaatram? vidamarachadigite muppa?
imta premakuu punaadi suutram, enti gauravam tappa?

marinta nee chenta cherenta konta naa vantu sonta gontu palikindi imtaa.
manakamtakamtakuu imtakimtakuu baagundenduke idamtaa.

kanukemayyindi? palukave kadanaka…
asalemayyindo telupave valadanaka…

ipudemayyindani naameedintalaka…
cheppemanukole. preminchaa ganaka… naa raachilaka…

podduna varakuu parichayamunnadi vere katha kaadaa?
haddu daataanu anukopote nimisham vinaraadaa?

vaddu annaaka ventapadanamma, telusunu maryaada
sadduku vidividi adugulu padite telike, avunaa kaadaa?
koddiga nilabadi aalochiste, endukee tagaadaa?
diddukovatam daarilo digite, duuramu darike raadaa?

peddapedda vaati vadda oddika iddarunna addamamdu chuudduvu vadda?
nee muddu muddaina maddhatu vini, ne siddhamu, vaddaku kaduluta.

kathakemayyindi? palukave kadanaka…
asalemayyindo telupave valadanaka…
ipudemayyindani naameedintalaka…
cheppemanukole. preminchaa ganaka… naa raachilaka…

chilaka…
em alaka…
melika…
kaadanaka…

Translation

Gamanikalu/Notes:

(“Chilaka” is literally a parrot, but refers to the girl here.)
(“Alaka” is hard to translate, but maybe think of it as pouting in mild anger.)
(“Oddika” is also kinda hard, but I’ll try.)

Oh, soft-spoken chilaka,
You don’t reply even if I call you.
A twist even when I’d won.
Won’t you tell me if you think of me?

I stood behind you,
oh girl/chilaka that loved me,

You hide away without a peep,
like the first raindrop of the season.
Please let go of the cloud,
why do you pout without letting it spill/rain down?

Tell me what happened, please speak,
please don’t say you won’t.
Tell me what even happened, please let me know,
please don’t say you won’t.
What even happened that’s making you
pout at me so much?
Tell me, it’s ok, I’ll understand.
I loved you, after all. Oh, my “Raachilaka”

Just because I’d told some strange truths,
did I say something wrong?
Just because pearls fall when you talk,
what makes you so special, hmm? 🥰

Could it be something of my own doing,
that my eyes now hide my anxious eagerness?
Is this stubbornness really necessary right now?
Interesting, as I’d only told you what is.
Why are you refusing to open up your voice,
for just this small thing?
Is it that wrong if I ask you to explain for me
What is the foundation principle/value,
for all this love between us, if it’s not respect?

To get closer to you, I’m doing my part,
my own voice is saying all this.
For things to get better between us,
and forever turn even more beautiful,
that’s why I’m saying all this.

So, tell me what happened, please speak,
please don’t say you won’t.
Tell me what even happened, please let me know,
please don’t say you won’t.
What even happened that’s making you
pout at me so much?
Tell me, it’s ok, I’ll understand.
I loved you, after all. Oh, my “Raachilaka”

Was it not a totally different story
that I knew, until this morning?
If you wouldn’t think I crossed a boundary,
won’t you please listen for a minute?
If you say no, I won’t follow/stalk you.
Don’t worry, I know how to be respectful.
If we really have to go our separate ways,
I’m sure it’ll get easier (on the heart)
once things settle down a bit.

So, if we can just stand still for a bit
and take time to think about it,
why do we even have to fight?
When we start on the path of correcting our mistakes,
won’t the distance melt away and bring us closer?

In the face of even the biggest of hurdles,
I’d want to see our intimacy/relationship/friendship
and the two of us together in the mirror… wouldn’t you?
Your beautiful/adorable support and consent
is all I’m waiting for, I’m ready, I’ll come closer.

Tell me what happened to our story, please speak,
please don’t say you won’t.
Tell me what even happened, please let me know,
please don’t say you won’t.
What even happened that’s making you
pout at me so much?
Tell me, it’s ok, I’ll understand.
I loved you, after all. Oh, my “Raachilaka”

Video

(Lyrical) Preliminary recording. Please note it still has typos, thanks. 🙂

This World Needs You

All of you. It really does. ♥︎

Lyrics

Oooh…
Oooh…
Oooh…
Oooh…

Lookin’ in your eyes. Lookin’ at your face
Take the time to see yourself. So much grace.
My, how the time flies, healin’ at its pace.
Really take a good look now. You’re in a good place. 

The door is still ajar, and the keys are with you. 
You can let yourself back in, you know that I’m so proud of you. 
And so you have a scar. And it makes you feel blue. 
But you came this far, just know that I’m so proud of you. 

You know what livin’ feeds? You know what this world needs?
Cuz you know it ain’t nothing if it ain’t true…

This world needs you…
This world needs you…
This world needs you…
This world needs you…

This world needs your heartbeat to count the rest of time. 
This world needs your words to make the rest of nature rhyme. 
This world needs your glow, to light up every climb. 
This world needs you to know that livin’s not a crime. 

It really loves your pitter patter
Don’t you think it doesn’t matter
Climbing up the highest ladder
Far above the chitter chatter
Of your mind… The greatest find…
Courage and kind… Intertwined…

You know what livin’ feeds? You know what this world needs?
Cuz you know it ain’t nothing if it ain’t true…

This world needs you…
This world needs you…
This world needs you…
This world… needs… you…

Video

Andam

అందం

Studio version of “అందం,” the Telugu song I wrote for Diwali.

Lyrics

Telugu

నిదానిస్తే ఈ క్షణం… ఎదురయ్యే జీవితం…
ఇదే ఇదే అందం… ఇదే ఇదే అందం…
ఎదురుగ వున్నా ఇంతటి అందం,
ఇది కనుగొన్నా ఎంతానందం…

తెల్లవారినప్పుడు తెల్ల మబ్బు దుప్పటీని
ముసుగుతన్ని కప్పుకున్న నీటివంక చూసినప్పుడు,
అలా, ఎలా? అనేలా…

పిల్ల చినుకులెప్పుడూ నల్ల మబ్బు గొడుగునుండి
నెమలి సైగ గుర్తుపట్టి పట్టువీడి రాలినప్పుడు,
అలా, ఎలా? అనేలా…

గాలిలో ఎగిరేదైనా, నీళ్లలో ఈదేదైనా,
నేలాపై నడిచేదైనా, వీలున్న ఏదేదైనా,
చల్లగా తాకేదైనా, పళ్ళు మనకిచ్చేదైనా,
మెల్లగా మారేదైనా, ఘల్లు గుసలాడేదైనా…

కళ్ళ ముందున్నదాన్ని గమనించనంత ఈ వింత పరుగు నీకేలరా…

ఎదురుగ అందం, ఎదురుగ అందం,
బెదరక రెప్పల వేదిక తెర తెరు
ఎదురుగ అందం,

తెల్లవారినప్పుడు తెల్ల మబ్బు దుప్పటీని
ముసుగుతన్ని కప్పుకున్న నీటివంక చూసినప్పుడు,
అలా, ఎలా? అనేలా…

కునుకులందు గని
మెలుకువందుకొని

కునుకులందు గని మెలుకువందుకొని
తనకు తెలుపుమని వెను గననిచ్చే
ధాతిరి నిజం అందం.
వలచిన కల అందం.

కనుగన్న కల అవుతుంటే
కలగన్న నిజమవుతుంటే
కొలువున్న కలువవుతుంటే…
కనుగొన్న దారే ఇంతటి
అందమైనదంటే…

ఎదురుగ అందం,
ఎదురుగ అందం,

తెల్లవారినప్పుడు తెల్ల మబ్బు దుప్పటీని
ముసుగుతన్ని కప్పుకున్న నీటివంక చూసినప్పుడు…

తళుకు మెరుపునని
వలకు దొరకనని

తళుకు మెరుపునని వలకు దొరకనని
కనుక గెలుపు తనదే అననిచ్చే
రాతిరి తెర అందం.
గెలిచిన వెలుగందం.

చేదన్నిది చెరపటమంటే
చెబుతాగా చెవి తెరిచుంటే
చిరునవ్వు దివ్వె చమురుంటే
చీకటిని చిలకడమంటే
అందమైనదంటే

చీలిక చాలిక చురుకున చక చక చీకటి చిలికేయ్యాలిగా
చేదుకి చెల్లిక చేరుకున్నమిక చెంగున చిందేయ్యాలిగా

సరిగసరిగసరిసరిగ గమపగమపగమగమప
పదనిపదనిపదపదని నీస పాద గమగరిస.

చకచక చిలికిన వెన్నెల వెన్న
చమకు చమకుమను మెరుపులు గన్నా
చిలకల వన్నెలు చిలికిన వెన్న
వన్నెల వెన్నెల వెన్నని విన్నా

సరిగసరిగసరిసరిగ గగాగ
గమపగమపగమగమప పపాప
పదనిపదనిపదపదని నినీని
నీని సా, నీని సా
నిస నిసా, నిస నిసా,
నిసనిస సరిసా, నిసనిస రీసా
నిసనిస రిగారిస, నిసనిస ^గరిసా
నిసనిస రిగరిస, నిసనిస రిగరిని
సా…
నిసనిస సరిసా, నిసనిస రీసా
నిసనిస రిగారిస, నిసనిస ^గరిసా
నిసనిస రిగరిస, నిసనిస రిగరిని
సా…
నీ నీ నీనినీ, దా నీ
సా సా సాససా, నిదనిస
నీ నీ నీనినీ, దా నీ
సా సా సాస రి^మగరి సా.
నీ నీనీని మా మామామ
పా పాపాద గా
గమపమ గమగరి సరిసన పదపమ
రి…

ఎదురుగ… అందం…

Tinglish

Translation

Video

Dabba

డబ్బా

Let’s look up and live our lives. Talettuku bratukudaam. 🤣

Lyrics

Telugu

Yeah, hey…
Yeah hey…
Yeah hey…

అరచేతుల్లో వెలిగే గాజు ముక్కరో
అరసిగ్నల్లే అందే దిక్కుకి మొక్కరో

అరచేతుల్లో వెలిగే గాజు ముక్కరో, [yeah, yeah]
అరసిగ్నల్లే అందే దిక్కుకి మొక్కరో [yeah, don’t do that]
అరిచిందంటే బుజ్జగించాలి, లెక్కరో, మళ్ళీ
అరనిమిషానికి మూలన ఎర్రటి చుక్కరో, [say what!?] మరి
భోజనమక్కర్లా, మనకో చార్జింగ్ తాడుంటే. సరే
లైఫే అక్కర్లా, ఫ్రీగా వైఫై తోడుంటే.

డబ్బా డబ్బా డబ్బా డబ్బా డబ్బా బతుకులురా,
వేరెవడో చేసిన డబ్బా దాటి లైఫును వెతుకుతు రా. అరె
డబ్బా డబ్బా డబ్బా డబ్బా డబ్బా బతుకులురా-అబ్బా
కరవదులేరా ఖర్చుపెట్టి అది మనమే కొన్నదిరా!

తలెత్తే ఫీచర్ వుందిరా,
డిజిటల్ కెరికేచర్ ఏందిరా?
మనకెంతో ఫ్యూచర్ వుందిరా,
పోగొట్టుకొనేందుకు ఎందుకు తొందరా?

డబ్బా డబ్బా డబ్బా డబ్బా డబ్బా బతుకులురా,
వేరెవడో చేసిన డబ్బా దాటి లైఫును వెతుకుతు రా. అరె
డబ్బా డబ్బా డబ్బా డబ్బా డబ్బా బతుకులురా. అబ్బా!
కరవదులేరా ఖర్చుపెట్టి అది మనమే కొన్నదిరా!

దొరకదు పొద్దున లేస్తే నిన్నటి ట్విట్టరు ట్రెండు.
ఉరకదు ఆపద వస్తే పక్కన వుండే ఫ్రెండు. [see that?]
దొరకదు పొద్దున లేస్తే మనకి నిన్నటి ట్విట్టరు ట్రెండు, కానీ
ఉరకదు ఆపద వస్తే తోడుగ పక్కన వుండే ఫ్రెండు.
తిరగకు రిప్లై వచ్చే దాకా కొట్టేసాక సెండు,
I repeat what i just said right now,
I say yes you can do… [because]
విరగదులేమ్మా…
విరగదులేమ్మా… అబ్బా!
విరగదు ఇన్బాక్స్ లోనే వుంటే ఒకటీ లేదా రెండూ

డబ్బా డబ్బా డబ్బా డబ్బా డబ్బా డబ్బా డబ్బా! అరె
డబ్బా డబ్బా డబ్బా డబ్బా డబ్బా బతుకులురా,
వేరెవడో చేసిన డబ్బా దాటి లైఫును వెతుకుతు రా.

గమ్ముని తయ్యారయ్యే, వ్యసనానికి సరితోడు.
నమ్మకానిపై కొట్టడానికై, యాప్పులో వుంది కోడు, [look it up]
గమ్ముని తయ్యారయ్యే దాకా వ్యసనానికి సరితోడు, నిన్ను
నమ్మకానిపై కొట్టడానికై యాప్పులో వుంది కోడు.
తిమ్మిని బొమ్నిని చేసి రోడు, నెమ్మది మీద మొత్తము తోడు,
కమ్మని పోయిసన్ లేటెస్ట్ ఫ్యాడు-ఈ, తిమ్మిరి తగ్గకపోతే బ్యాడు.
అమ్మేసాకా [for all purposes]…
అమ్మేసాకా… నిన్ను
అమ్మేసాకా గుర్తేమంటే మనకంటు ఓ యాడ్డు,

డబ్బా డబ్బా డబ్బా డబ్బా డబ్బా డబ్బా డబ్బా! అరె
డబ్బా డబ్బా డబ్బా డబ్బా డబ్బా డబ్బా డబ్బా! అరె
డబ్బా డబ్బా డబ్బా డబ్బా డబ్బా బతుకులురా,
వేరెవడో చేసిన డబ్బా దాటి లైఫును వెతుకుతు రా. అరె
డబ్బా డబ్బా డబ్బా డబ్బా డబ్బా బతుకులురా, అబ్బా
డబడబడబడబడబడబడబడబడబడబడబడబడ!

వచ్చిన దానికి ఎంతమంది, ఫోననుకొని చూసారు?
గుచ్చి గుచ్చి అడగనులే, ఏమని గమనించారు? ఇపు-
-డొచ్చిన దానికి ఎంతమంది మీ ఫోననుకొని చూసారు? నే
గుచ్చి గుచ్చి అడగనులేగానీ ఏమని గమనించారు?
వచ్చిన వెంటనే చూడనివారికి పిచ్చని ఎవరన్నారు?
ఈ ట్విచ్చునాపగల స్విచ్చు దొరికితే రిచ్చులు కురిపిస్తారు.
ఖచ్చితంగా…
ఖచ్చితంగా… నువు
వెచ్చించే గురి మచ్చికైతే విలువిచ్చుట వచ్చంటారు.

ఇప్పుడు,
అరచేతుల్లో వెలిగే గంధపు చెక్కరో, [yeah yeah]
అరవిందాలే ఎదురై హాయిగా క్లిక్కురో, [say cheese!]
అరవై దాటినా చూపుందందాం లక్కురో, మళ్ళీ
అరహత దాటక మనకై ఆగే మూలన ఎర్రని చక్కని చుక్కరొ!

డబ్బా డబ్బా డబ్బా డబ్బా డబ్బా డబ్బా డబ్బా! మరి
చాట్టే అకర్లా అరిటాకుల విస్తర ముందుంటే, సరే
ట్వీటే అకర్లా, లైఫే స్వీట్టని తాట్టుంటై!

Yeah, hey…
Yeah hey…
Yeah hey…

Tinglish

Yeah, hey…
Yeah hey…
Yeah hey…

arachetullo velige gaju mukkaro [yeah, yeah]
ara signaley ande dikkuki mokkaro [yeah, don’t do that]
arachindante bujjaginchali, lekkaro [wait, what!?] malli
aranimishanike mulana errati chukkaro, [aww, man]

mari bhojanam akarlaa,
manako charging taadunte
sare life-ey akarlaa,
free ga wifi todunte. [what the…!?]

dabba dabba dabba dabba dabba bathukuluraa,
verevado chesina dabba dati life-nu vetukutu raa.
arey dabba dabba dabba dabba dabba bathukuluraa,
abbaa! karavadulera kharchupetti adi maname konnadiraa!

talette feature vundira, digital caricature endira?
manakento future vundira. pogottukonenduku enduku tondara?

dabba dabba dabba dabba dabba bathukuluraa,
verevado chesina dabba dati life-nu vetukutu raa.
arey dabba dabba dabba dabba dabba bathukuluraa,
abbaa! karavadulera kharchupetti adi maname konnadiraa!

dorakadu podduna leste ninnati twitteru trendu
urakadu aapada vaste pakkana vunde friendu [see that?]

dorakadu podduna leste manaki ninnati twitteru trendu, kaani
urakadu aapada vaste toduga pakkana vunde friendu.
tiragaku reply vacchey daka kottesaaka sendu.
I repeat what i just said right now I say yes, you can do… [because]
viragadulemmaa… [I’m sure]
viragadulemmaa… [abbaa!]
viragadu inbox loney vunte okati leda rendu.

dabba dabba dabba dabba dabba dabba dabba! arey
dabba dabba dabba dabba dabba bathukuluraa,
verevado chesina dabba dati life-nu vetukutu raa! [makes sense]

gammuni tayyarayye vyasanaaniki sari todu,
nammakanipai kottadanikai app-u lo vundi code-u. [look it up]

gammuni tayyarayye daka vyasanaaniki sari todu, ninu
nammakanipai kottadanikai app-u lo vundi code-u.
timmini bommini chese roadu, nemmadi meeda mottamu todu,
kammani poison latest fad-u, ee timmiri taggakapote bad-u.
ammesaaka [for all purposes…]
ammesaaka… [ayyo!] ninnu
ammesaaka gurteymante manakantuu o ad-u.

dabba dabba dabba dabba dabba bathukuluraa,
verevado chesina dabba dati life-nu vetukutu raa.
arey dabba dabba dabba dabba dabba bathukuluraa,
abbaa! dabadabadabadabadabadabadabadabadabadabadabadabada!

vacchina daniki entamandi phone anukoni chusaru?
gucchi gucchi anaganule, emani gamanincharu? [ouch]
ipudocchina daniki entamandi mee phone anukoni chusaru? ne
gucchi gucchi anaganule kaanii, emani gamanincharu?
vacchina ventane chuudanivariki picchani evarannaru?
ee twitch-unaapagala switch-u dorikite ricchu-lu kurpistaru.
khacchitanga… [for sure!]
khacchitanga…
nuvu vecchinche guri macchikaite viluvicchuta vacchantaru. [wow!]

ippudu,
arachetullo velige gandhapuchekkaro, [yeah yeah]
aravindaale edurai haayiga click-u ro, [say cheese!]
aravai daatina chuupundandaam, luck-u ro [uh-huh], mallii
arahata daataka manakai aage moolana errati chakkani chukkaro!

mari chat-ey akarlaa aritaakula vistara munduntey,
sarey tweet-ey akarlaa, life-ey sweet ani thought untey…

Yeah, hey…
Yeah hey…
Yeah hey…

Translation

(Just know that dabba = container/box.)

A glowing piece of glass in your palm [yeah, yeah]
Prayer hands to where there’s half a signal [yeah, don’t do that]
If it screams, we pacify it, that’s a given [wait, what!?]
30 seconds later, another red dot in the corner. [aww, man]

Don’t need food, just a charging cable.
Don’t need life, if there’s free wifi. [what the…!?]

dabba dabba dabba dabba dabba lives,
Get out of the dabba someone else made, and come find your life.
arey dabba dabba dabba dabba dabba lives,
Sheesh! It won’t bite. You bought the thing. You own it.

You can look up, you know? Why live through digital caricatures?
We’ve a future ahead of us. Why rush to let it all go?

dabba dabba dabba dabba dabba lives,
Get out of the dabba someone else made, and come find your life.
arey dabba dabba dabba dabba dabba lives,
Sheesh! It won’t bite. You bought the thing. You own it.

By the morning, last night’s twitter trend is gone.
When you need it, a friend wouldn’t do that. [see that?]
Don’t stick around after you click send, waiting for a reply.
I repeat what i just said right now. I say “yes, you can do it.” [because]
It won’t break… [I’m sure] it won’t break… [Sheesh!]
Your inbox won’t break if there’s one or two in there.

dabba dabba dabba dabba dabba dabba dabba! arey
dabba dabba dabba dabba dabba lives,
Get out of the dabba someone else made, and come find your life! [makes sense]

Engineering an addiction to go with it,
To hit you where you trust it most is written in in its code. [look it up]
This is the road to confuse you, to slowly mine all you’ve got,
This sweet, slow poison is the latest fad. Shake off this numbness, it’s bad.

After they’ve sold you [for all purposes…]
After they’ve sold you… [yikes!]
After they’ve sold you, the only way to find out is an ad made just for you.

dabba dabba dabba dabba dabba lives,
Get out of the dabba someone else made, and come find your life.
arey dabba dabba dabba dabba dabba lives,
Sheesh! dabadabadabadabadabadabadabadabadabadabadabadabada!

How many of you just reached for your phone?
I won’t push it, but what did you notice? [ouch]
Who said those who don’t check right away are crazy?
If you can find a switch to kill this twitch, you’ll be rich.

Certainly… [for sure!]
Certainly…
If you’re careful where you place your attention,
you’ll be known for knowing what has (true) value. [wow!]

now,

the finest piece of sandalwood in your palm, [yeah yeah]
Smiles all around, go ahead and click (your camera) all you want, [say cheese!]
Let’s boast we can see even after 60, because that’s lucky [uh-huh],
Never again will it rush us, but gently just be a red dot in the corner, waiting pleasantly!

We don’t need messages when we sit down to eat.
And of course, we don’t “need” to tweet, as long as we think our life is sweet…

Video

Golden Brown

(This ABCD Life)

Let’s love our skin. ✊🏽 The experience of ABCDs everywhere. ♥️

Track: https://song.link/i/1477511374

Lyrics

Hi, we hardly met you. Bet y’all chat us up down to the car. I’m
tearin’ up, we pull away. I didn’t think we’d make this far! A-
-pologies, it skimmed my toe. So, peeps or books, it doesn’t matter.
Rolling pins have many uses. Puri press is best for batter.
We legit, we own each lingo. Take the prize if this were bingo.
Line up accent, dialects. You can’t autocorrect our texts.

We’re golden brown.
We’re golden brown.
In a కోనసీమ village or in LA downtown,
We’re golden brown.
We’re golden brown.
In aకోనసీమ village or in LA downtown,
We’re golden brown.
We’re golden brown.

On
friday night with the fam, whatever’s on NetFlix, But
ready to zone out if the scene’s a bit racy and our
album has the wrapper but its full of our old pics, and
Everythin’ in the house is wearing somethin lacy. We’ve been
livin here as NRIs. It’s been a while to untrained eyes, we’re
cool with our English still a little bit desi. We be
lovin’ both, and breathe jus’ fine, తెలుగు రాదని fix అవకండి.
కష్టపడాలి మేమిప్పుడు ఈ actingలన్నీ చేసి.

We be golden brown.
We’re golden brown.
In a కోనసీమ village or in LA downtown,
We’re golden brown.
Love it golden brown.

Our
grooves are divine, bustin moves like we flyin’, and we
ain’t even tryin’, but our beat’s in aadi. But be
careful what’s on Facebook, yo. Everyone who’s on there knows at
least one site that’s similar to one by name of Shaadi. You don’t
need no shoppin now bro. Unnamed bandhu’s on the flight, so you
got yo super comfy-lookin grampa-style in khaadi. Yo
lookin’ fo’ my house, cuz we were forced to be polite , so just
find the door with mango leaves and, /sigh/ ade maadi.

Cuz we know it deep down.
We’re golden brown.
Livin’ golden brown.

Overdone in brownies gives ‘em that much more crunch, we don’t
care to fake squat tryin’ to impress bein’ paler. As my
great great grand Tata once told me over lunch, he said to
Never judge a Telugu movie just by its trailer. There’s a
clean list of tracks we keep ‘em loaded by the bunch, on our
phones with the ones where she be cussin like a sailor.
Hey hey, we be loving both our lassi and our punch, and we can
guzzle up incense without needing an inhaler.

Might be new to this town.
But we’re golden brown.
PDX, LAX, ATX, Miami, Philly,
We’re golden brown.
Lovin’ golden brown.

We’re not always doctors or be fixin’ up yo apps, but ya
think we ain’t no party though we do sure love our naps, but we
Just have feels like all of y’all, well maybe stuck in CAPS. We’re
just a cool bit different ‘t’sall. We’ve baalchi’s by our taps. We’ll be
running for the prez, or be back touring from the moon or we’ll be
drawing til our finger’s sore to make our favorite toon. Or we’ll be
plantin’ down some greens, or be like fryin’ up some beans, Or be like
chattin’ up our teens who will be growin’ up soon.
Hey maybe we’ll go pro, go be skiin’ in the snow,
or be shootin morning shows well past noon. And what-
-eva’ we be doin’ and whateva we be chewin’, this big
crowd here ain’t booin’ మన్ని anytime soon.

Turn that frown upside down.
We’re golden brown.
We don’t need no fancy crown.
We’re golden brown.
In a కోనసీమ village or in LA downtown,
We’re golden brown.
We got this down.
PDX, LAX, ATX, Miami, Philly,
We’re golden brown.
We’re golden brown.
We’re golden brown.
Livin’ golden brown.
Lovin’ golden brown.

We’re golden brown.

Video

Chalu (5 Tracks)

చాలు

Chalu (Album)

Album

Streaming: https://album.link/bwzqq6whv830h

Tracks

#TrackతెలుగుLinkStreaming
⠀⠀⠀⠀⠀⠀⠀⠀⠀
1
⠀⠀⠀⠀⠀⠀⠀⠀⠀
⠀⠀⠀⠀⠀⠀⠀⠀⠀
Chanti Papadai (I’ll Live)
⠀⠀⠀⠀⠀⠀⠀⠀⠀
⠀⠀⠀⠀⠀⠀⠀⠀⠀
చంటి పాపడై
⠀⠀⠀⠀⠀⠀⠀⠀⠀
⠀⠀⠀⠀⠀⠀⠀⠀⠀
snehith.com/cp
⠀⠀⠀⠀⠀⠀⠀⠀⠀
⠀⠀⠀⠀⠀⠀⠀⠀⠀
https://song.link/us/i/1434346825
⠀⠀⠀⠀⠀⠀⠀⠀⠀
⠀⠀⠀⠀⠀⠀⠀⠀⠀
2
⠀⠀⠀⠀⠀⠀⠀⠀⠀
⠀⠀⠀⠀⠀⠀⠀⠀⠀
Nanna (Love You, Dad)
⠀⠀⠀⠀⠀⠀⠀⠀⠀
⠀⠀⠀⠀⠀⠀⠀⠀⠀
నాన్న
⠀⠀⠀⠀⠀⠀⠀⠀⠀
⠀⠀⠀⠀⠀⠀⠀⠀⠀
snehith.com/nanna
⠀⠀⠀⠀⠀⠀⠀⠀⠀
⠀⠀⠀⠀⠀⠀⠀⠀⠀
https://song.link/us/i/1434346828
⠀⠀⠀⠀⠀⠀⠀⠀⠀
⠀⠀⠀⠀⠀⠀⠀⠀⠀
3
⠀⠀⠀⠀⠀⠀⠀⠀⠀
⠀⠀⠀⠀⠀⠀⠀⠀⠀
Aagu! Stop!
⠀⠀⠀⠀⠀⠀⠀⠀⠀
⠀⠀⠀⠀⠀⠀⠀⠀⠀
ఆగు! Stop!
⠀⠀⠀⠀⠀⠀⠀⠀⠀
⠀⠀⠀⠀⠀⠀⠀⠀⠀
snehith.com/aagu
⠀⠀⠀⠀⠀⠀⠀⠀⠀
⠀⠀⠀⠀⠀⠀⠀⠀⠀
https://song.link/us/i/1434346829
⠀⠀⠀⠀⠀⠀⠀⠀⠀
⠀⠀⠀⠀⠀⠀⠀⠀⠀
4
⠀⠀⠀⠀⠀⠀⠀⠀⠀
⠀⠀⠀⠀⠀⠀⠀⠀⠀
Tha (‘Thaa’tho Thamaashaa)
⠀⠀⠀⠀⠀⠀⠀⠀⠀
⠀⠀⠀⠀⠀⠀⠀⠀⠀
‘త’తో తమాషా
⠀⠀⠀⠀⠀⠀⠀⠀⠀
⠀⠀⠀⠀⠀⠀⠀⠀⠀
snehith.com/tha
⠀⠀⠀⠀⠀⠀⠀⠀⠀
⠀⠀⠀⠀⠀⠀⠀⠀⠀
https://song.link/us/i/1434346830
⠀⠀⠀⠀⠀⠀⠀⠀⠀
⠀⠀⠀⠀⠀⠀⠀⠀⠀
5
⠀⠀⠀⠀⠀⠀⠀⠀⠀
⠀⠀⠀⠀⠀⠀⠀⠀⠀
Shock Avvaku (Don’t Be Shocked)
⠀⠀⠀⠀⠀⠀⠀⠀⠀
⠀⠀⠀⠀⠀⠀⠀⠀⠀
షాక్ అవ్వకు
⠀⠀⠀⠀⠀⠀⠀⠀⠀
⠀⠀⠀⠀⠀⠀⠀⠀⠀
snehith.com/shock
⠀⠀⠀⠀⠀⠀⠀⠀⠀
⠀⠀⠀⠀⠀⠀⠀⠀⠀
https://song.link/us/i/1434346831
⠀⠀⠀⠀⠀⠀⠀⠀⠀

Tha

‘త’తో తమాషా

తెలుగుని ఇటాలియన్ అఫ్ ది ఈస్ట్ అన్నారు. నేనీ పాటను కేవలం ‘త’ గుణింతంతో మొదలయ్యే తెలుగు పదాలతోనే రాసేను (వ్రాసేను 😉).

Telugu has been called the Italian of the East, and I wrote this song using only words that start with the “th” sound, written as “త” in Telugu.

Streaming: https://song.link/us/i/1434346830

Lyrics

Telugu

తుమ్మెదై తిరిగింది తేనెలు తాగి
తమలో తేలాడి తుళ్ళి తూగి
తుంపిళ్ళ తడి తాకి, తగ్గిన తనకి
తిరకాసు తిరాగేసే తెలివి తొణికి
తొందర తనది, తప్పదు తెలుసా
తనివితీరా… తాగనీ… త తో తమాషా…!

=

తలుపు తడితే తీస్తూ తీయక తత్తర తగ్గక తరిమే తలపుతో
తలపు తాకిన తలలో తిరుగుతు తన తలెత్తి తీపంది తలుపుతో
తలపు తోడని తాట్టును తుడిచిన తెరను తీయననే తలుపు తీరుతో
తెలుపు తీసి తెర తడిమి తొంగి తను తలపడేది తగదంది తెగువతో

తీయ తీయవని తలపులు తడితే తనివితీర తమ తలలో
తీయి తీయిమని తలుపులు తడితే తాళం తయారు తనలో

తిత్తి తరంతో… తాత తరంతో…
తిత్తి తాత తల్లి తండ్రి, తెగ తెలివి తళుకుమను తోటి తరంతో

తాళం తప్పిన తాన తందనకు తాళం తీసే తెగువల తరాలతో

తలకిందుల తపస్సు తెలిసేంత త త త
తలతలమని తేజస్సు తగిలేంత త త త
తెలివితో తమ తత్తర తగ్గేంత త త త
తెలుగంతా తొణికిశలాడేంత త త త

=

త్రాచుగ తోచాయంతే, తమ తంబూరావి తెగిన తీగలే
తరచుగ తెచ్చాయంతే-తిప్పలు తాజాతనమే తగులుతుందిలే

తొంభై తొమ్మిది తీరంతే, తక్కువ తూగే తగువే
తప్పుడు తూటా తగిలిందో తప్పులేదు తవ్వే తెగువే

తపనా తాపత్రయమేది? తాయత్తులు తీసే తెగువేది?

తొలితొలి తప్పుల తడి తప్పదుగా, తట్తుకు తీరము తాకే తెగింపుతో

తలుపు తీయ తమ తరమని తెరిచేంత త త త-
తోషపు తామరతంపర తరచేంత త త త
తెలివితేటలతో తీవ్రము తరిగేంత త త త
తరమేదైనా తడాఖా తొళికేంత త త త

=

తెల్లవారెనని తరతరాలుగా తూరుపు తిరిగితే తెలియు తేలికే
తెల్లబోయి తారజువ్వ తాళం తెంచుకు తిరిగితే తమాష-తళుకే

తప్పెవ్వరిదని తయ్యారే తప్పనిసరి తికమకలే
తప్పొప్పుకొనే తరుణంలో తిప్పుకోలేక తలచుకొనే

తీర్పు తీసుకొను తెగువేది? తను తప్పుకుపోయిన తిరిగొచ్చేది

తరుక్కుమన్నా తేరుకున్నాక తృప్తిగ తలెత్తి తిరిగే తరుణంతో

తెగ తలపుల తుఫాను తగ్గేంత త త త
తదుపరి తేనెలలో తడిసేంత త త త
తలరాతలు తిరగేసేటంత త త త
తారలతో తళుకున తిరిగేంత త త త

తీయ తీయవని తలపులు తడితే తనివితీర తమ తలలో
తీయి తీయిమని తలుపులు తడితే తాళం తయారు తనలో

తిత్తి తరంతో… తాత తరంతో…
తిత్తి తాత తల్లి తండ్రి, తెగ తెలివి తళుకుమను తోటి తరంతో

తాళం తప్పని తాన తందనకు తాళం తప్పక తెచ్చే తరాలతో

తలకిందుల తపస్సు తెలిసేంత త త త
తలతలమని తేజస్సు తగిలేంత త త త
తెలివితో తమ తత్తర తగ్గేంత త త త
తెలుగంతా తొణికిశలాడేంత త త త

తెలిపుంచా తేలిక తోచేంత…
‘త’తో తమాష తారుమారైనా తలచిన తరఫున తోడందించిన
తెలుగు తల్లి తను తూచాయిగ తరళొచ్చిన తారక తానే తోచేంతా…

తత్తరికిటతక తధీంగీణతక త త త త
తళాంగు తోం తక్ తకధరికిటతక త త త త
తళాంగు తఝ్ఝను తత్తరికిటతక త త త త
తళాంగు తోం తళాంగు తోం తకధరి, తళాంగు తోం తళాంగుతత్తరికిట థా…

Tinglish

Translation

Video

Aagu! Stop!

అగు! STOP!

A lot of people in this world have depression, regardless of age, gender, location, or time. Some depressive episodes can be unpredictable, but that is the time when we must stay strong. Sometimes, frustration can make living feel like a burden. I felt that way before, but luckily I survived. It’s not easy, but we must try.

If you or someone you know is considering suicide, please ask for help immediately! I cannot stress this enough. There is no shame in asking for help when we need it the most. If anything, it shows strong judgement skills, and a beautiful will to live.

I decided to write a song to motivate and dissuade anyone who might be considering suicide. This is not the only way to raise awareness, but it’s one close to my heart.

I am not a doctor, nor do I have a degree in psychology, but I felt great when writing and acting, and I want to believe if you find something that gets you to smile even a little, it’ll make your life that much easier.

If you like this effort, please like, share, subscribe, or comment, but first, take this moment to breathe.

Thank you, Snehi

Lyrics

Telugu

ఇక దూకేద్దామనుకుంటే ఆగు!
టక తాగేద్దామనుకుంటే ఆగు!
చక చుట్టేద్దామనుకుంటే ఆగు!
ఆగు!

ఆగు ఆగు ఆగు STOP!
ఆగు ఆగు STOP!

గడ గుటకేద్దామనుకుంటే ఆగు!
వడి ఉరికేద్దామనుకుంటే ఆగు!
పడి పోనిద్దామనుకుంటే ఆగు!
ఆగు!

ఆగు ఆగు ఆగు STOP!
ఆగు ఆగు STOP!

ఆగు ఆగు ఆగు STOP
ఆగు ఆగు STOP
ఆగు ఆగు ఆగు STOP
ఆగు ఆగు STOP

కదిలించే కథ నీదైతే,
తలదించుకొనది నూ కాదైతే
వదిలించుకోనే వరమైతే, నిను
నడిపించిన మది తడబాటైతే

నేడు శ్వాశ బంధిస్తుంటే,
ప్రాణాయామానికి OK.
నాడి వెనుక లయ లేదంటే,
ప్రయాణమిది నీకైంటి-OK!?
గతుకు నేలాపై గెలుపంటే,
మెతుకు మిగిలినా మనకి OK.
బతకటానికిది బలమంటే,
వాడుకోవా!? ఏమనుకోకే!

తలపుల మధనం వస్తే రానీ,
తలుపులు తెరిచుంచావని,
తడబడి తత్తరపడి తటికిలపడి
తొందరపడి నూ చావ్వని

నేననుకున్నది, కన్నది, విన్నది,
నీ ముందున్నది నిజమైతే!

ఆగు ఆగు ఆగు
బతుకే బాగు బాగు
ఆగు ఆగు ఆగు, నువ్వు
కుదుటపడ్డాక అటుపై సాగు

ఆగు ఆగు ఆగు
తాడందిస్తా పట్టుకు లాగు
ఆగు ఆగు ఆగు, ముందు
ధైర్యం పాటగ తెచ్చా తాగు

చాలానే విన్నా…
చాలానే విన్నా, నువ్వేంటో మొత్తం గమనించా
చాలు చాలు అంటున్నా, ఇంకా ఆలోచించా, నువు
చలించే చిన్నవన్నీ, చవిచూసి పలకరించా
చలిగాలి చుట్టుకున్నా నువ్వు వణకవని లెక్కించా

గెలుపుంది నీ కథకు.
తెలివుంది తవ్వి వెతుకు.
బలమెక్కడున్న అతుకు.
ఎలాగైన బతుకు.
ఇలానే నేనూ బతికా…
నువ్వూ బతుకు.

నేననుకున్నది, కన్నది, విన్నది,
నీ ముందున్నది నిజమైతే!

ఆగు ఆగు ఆగు
తాడందిస్తా పట్టుకు లాగు
ఆగు ఆగు ఆగు, ముందు
ధైర్యం పాటగ తెచ్చా తాగు

కదిలించే కథ నీదైతే,
తలదించుకొనది నూ కాదైతే
వదిలించుకోనే వరమైతే, నిను
నడిపించిన మది తడబాటైతే

నేడు శ్వాశ బంధిస్తుంటే,
ప్రాణాయామానికి OK.
నాడి వెనుక లయ లేదంటే,
ప్రయాణమిది నీకైంటి-OK!?
గతుకు నేలాపై గెలుపంటే,
మెతుకు మిగిలినా మనకి OK.
బతకటానికిది బలమంటే,
వాడుకోవా!? ఏమనుకోకే!

తలపుల మధనం వస్తే రానీ,
తలుపులు తెరిచుంచావని,
తడబడి తత్తరపడి తటికిలపడి
తొందరపడి నూ [uh-huh],

నేననుకున్నది, కన్నది, విన్నది,
నీ ముందున్నది నిజమైతే!

ఆగు ఆగు ఆగు STOP!
ఆగు ఆగు STOP!
ఆగు ఆగు ఆగు STOP!
ఆగు ఆగు STOP!
ఆగు ఆగు ఆగు STOP!

STOP!

Tinglish

ika dookEddaam anukunTE aagu!
Taka taagEddaam anukunTE aagu!
chaka chuTTEddaam anukunTE aagu!
aagu!
aagu aagu aagu STOP!
aagu aagu STOP!

gaDa guTakEddaamanukunTE aagu!
vaDi urikEddaam anukunTE aagu!
paDipOniddaam anukunTE aagu!
aagu!
aagu aagu aagu STOP!
aagu aagu STOP!

aagu aagu aagu STOP!
aagu aagu STOP!
aagu aagu aagu STOP!
aagu aagu STOP!

kadilinchE katha needaitE,
taladinchukonadi nuvu kaadaitE.
vadilinchukonE varamaite, ninu
naDipinchina madi taDabaaTaitE.

nEDu SvaaSa bandhistunTE,
praaNaayaamaaniki OK.
naaDi venuka laya lEdanTE,
prayaanamidi neekEnTi OK!?

gatuku nElapai gelupanTE,
metuku migilinaa manaki OK.
batakaTaanikadi balamanTE,
vaaDukOvaa? EmanukOkE!

talapula madhanam vastE raanee,
talupulu terichunchaavani,
taDabaDi tattarapaDi taTikilapaDi
tondarapaDi nuu chaavvani,

nEnanukunnadi, kannadi, vinnadi,
nee mundunnadi nijamaitE!

aagu aagu aagu!
batukE baagu baagu!
aagu aagu aagu! nuvvu
kuduTapaDDaaka aTupai saagu!
aagu aagu aagu! nE
taaDandistaa paTTukulaagu!
aagu aagu aagu! mundu
dhairyam paaTaga tecchaa taagu!…

chaalaanE vinnaa…
chaalaanE vinnaa, nuvvenTO
mottam gamaninchaa.
chaalu chaalu anTunnaa,
inkaa aalOchinchaa. nuvu
chalinchE chinnavannee,
chavichuusi palakirinchaa.
chaligaali chuTTukunnaa
nuvvu vaNakavani lekkinchaa.

gelupundi nee kathaku.
telivundi tavvi vetuku.
balamekkaDunna atuku.
elaagaina batuku.

ilaanE nEnu kUDaa batikaa…
nuvvuu batuku.

nEnanukunnadi, kannadi, vinnadi,
nee mundunnadi nijamaitE!

aagu aagu aagu!
batukE baagu baagu!
aagu aagu aagu! nuvvu
kuduTapaDDaaka aTupai saagu!

kadilinchE katha needaitE,
taladinchukonadi nuvu kaadaitE.
vadilinchukonE varamaite, ninu
naDipinchina madi taDabaaTaitE.

nEDu SvaaSa bandhistunTE,
praaNaayaamaaniki OK.
naaDi venuka laya lEdanTE,
prayaanamidi neekEnTi OK!?

gatuku nElapai gelupanTE,
metuku migilinaa manaki OK.
batakaTaanikadi balamanTE,
vaaDukOvaa? EmanukOkE!

talapula madhanam vastE raanee,
talupulu terichunchaavani,
taDabaDi tattarapaDi taTikilapaDi
tondarapaDi nuu [uh-uh],

anukunnadi, kannadi, vinnadi,
nee mundunnadi nijamaitE!

aagu aagu aagu STOP!
aagu aagu STOP!
aagu aagu aagu STOP!

STOP!

Translation

Video