

My own project.
I also played the role of Earth in my video.
Lyrics
Telugu
ఇక
గాజు తీగ మృదువు మీటి చాలదు,
రాజుకున్న నిప్పు కణములెదుట. “స-
-మాజమా!” అని చేయి చాచిన రాలదు,
హాజరవ్వరసలు జనము మొదట. ఈ
తల్లి కడుపు కాలుతున్న నవ్వి,
కుళ్ళిపోయే దాకా నన్ను తవ్వి,
జల్లెడేసి జీవమింత ఓడిన
మళ్లీ నాలో మిగిలినంతా తోడి,
విలువలు వాగే రాజికీయం
సలసల కాగితే బదులివక,
విలవిలలాడినా తలుపు తీయ్యవ్! నీ
కాపరి ఒప్పినదూపిరికా!??
నెత్తుటి మరకలు కొత్తేం కాక,
మెత్తటి ఇరుకుల మత్తులు పోక,
కత్తిపోటులిక లెక్కకు రాక,
విత్తునాటడం విలువ తెలీక, నే
ఊరుకుంటే తెగ రెచ్చిపోతావు,
వికృతమే నువ్వాడే ఆట. నే
జూలు విదిలిస్తే చచ్చిపోతావు (విను)
ప్రకృతిగా ఇది నా మాట! (నువు)
ఎక్కితొక్కేటి బానిసగాను!
మక్కలొక్కోటీ నాకు జవాను!
లెక్క తక్కువైతె వూరుకోను!
ఒక్క హక్కు కూడ వదులుకోను!(నువు) దిక్కు తోచకే దిక్కు పట్టినా
నేను తప్ప దిక్కు లేదు నీకు.
తిక్క పెట్టి(-నా / నువు) గుక్కబెట్టినా-
-గాని రెప్ప చుక్క లేదు, నీ కను-
-లింత పిసరు కూడ తడవలేక,
అంతరసుర నీడ విడువలేక,
పాలు దక్కగానె రొమ్ము తన్నితే
పేలి వక్కలవ్వు కొమ్ములన్నీ! (ఏఁ!?)
మంచిగ చెప్తే బుఱ్ఱకెక్కదా!?
కళ్ళు నెత్తికెక్కాయా!? ఏఁ!?
కంచె విప్పితే విఱ్ఱవీగుతూ
వెళ్ళి విషము కక్కేయ్యాలనుకొని
గొడ్డలుంది నాకు అన్న పొగరే,
వున్న కొమ్మ నరకమన్న తెలివై,
అడ్డముంది పీకనున్న చిగురే,
చిన్న రెమ్మ అతకలేవు, అలవే
లేదన విషయం బయిటకొస్తే
కాదని అగ్గితో అనగలవా?
నీదను విషమే పరులు చూస్తే,
ఇక వాదన నెగ్గుకు రాగలవా?
వితండవాదం సరిపడు కసికి,
మతుండే? (నీ) పాదం తలపడు నిశికి!?
వేరు నరికి వేరుగావు, పిచ్చా!?
దారి మురికి కోరి చావు చచ్చావ్!
అనుకొని పెరికి విసరి వేస్తే సం-
-తాపము క్షణమే తాకునుగా. నే-
-లెరుగని శూన్యము లోకి తోస్తే
భూతాపము వెనుకకు పాకునుగా!
నాటినుండి నాటమంటూ ఉండే
మాటనుండి సూటి గుండె పిండే
పాట పండి కోటికండగుండి
చాటి రండి మండుటెండకెండి. ఇక
Tinglish
Translation